పంటకోత- నిల్వ :

ఆముదపు పంట అంతా ఒకేసారి కోతకురాదు. 3-4 సార్లు కాయల కోయవలసి వస్తుంది. విత్తిన 90-95 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది.

ఒక గెలలో 80 శాతం వరకు కాయలు ముదిరి, ఆకుపచ్చ రంగు నుండి లేత పసుపు రంగుకు మారినపుడు ఆ గెలను కోసుకోవాలి. కాయలను బాగా ఎండబెట్టి , తేలికైన కర్రలతో కొట్టి విత్తనాలను నుర్చుకోవాలి.

గింజల్లో 9-10 శాతం తేమ ఉండేటట్లు బాగా ఎండబెట్టి గొనె సంచుల్లో నిలువ ఉంచుకోవాలి.